తన చెల్లెలికి అన్యాయం జరిగిందని ఓ అక్క చెల్లి భర్తను అతి దారుణంగా కొట్టింది. ఆమె అతణ్ణి కొడుతున్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి.. అతను ఆమె చెల్లెలిని అతి దారుణంగా చంపారని ఆరోపణలు చేసింది. తన చెల్లిని తనకూ కాకుండా చెసారని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతను కనిపించగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపొయింది. అతణ్ణి చేతికి అందిన వస్తువులతో తీవ్రంగా కొట్టి గాయపరించింది.
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దామోహ్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం కలకలం రేగింది. ఓ పురుషుడిపై మహిళ భౌతిక దాడికి పాల్పడింది. తీరా ఆ విషయం గురించి కొందరు ఆరా తీస్తే అతనికి ఆమె స్వయానా వదిన అవుతుంది. ఆమె చెల్లెలితో అతనికి పెళ్ళి జరిగిందని మహిళ పెర్కొంది. అంతేకాదు అదనపు కట్నం కోసం వెధించెవాడు అని ఆమె అంటుంది. పెళ్ళాం కడుపుతో ఉందని కూడా చూడకుండా ఆమె కొట్టడం తో ఆమెకు రక్త్ర స్రావం అయ్యింది.అది భరించలెని ఆమె పురుగుల మందు తాగి చనిపొయింది.
విషయాన్నికొస్తే.. హేమావతి అనే యువతి రెండేళ్ల క్రితం లాక్డౌన్ సమయంలో గోవింద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. హేమావతి తండ్రి దాదాపు ఆరు లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు.అయిన అతనికి డబ్బు దాహం తీరలెదు.. ఇంక ఎక్కువ డబ్బులను తీసుకు రావాలని నిత్యం వెధించెవాడు.. కొద్ది రోజులకు ఆమె అలానే తల్లి అయ్యింది. అప్పుడు కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.. అత్తింటి వారి వేధింపులు భరించలేక హేమావతి శుక్రవారం రాత్రి విషం తాగేసింది. ఆమెను భర్త వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. రెండ్రోజుల చికిత్స అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించింది. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న అక్క అతణ్ణి కొట్టింది. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్ళి కేసు నమోదు చేసింది.