మానవత్వం మంట కలిసిపోయింది. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో అమానుష ఘటనలే జరుగుతున్నాయి. మనిషిని మనిషే నమ్మ లేని పరిస్థితుల్లో సమాజం తయారయింది. ఇంత
టెక్నాలజీ పెరిగిన, ఆకాశానికి నిచ్చెన వేసే రోజులు వచ్చినా ఇలాంటి మూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు అని చెప్పవచ్చు. మరి వీటిని అడ్డుకునేది ఎవరు. వారికి అర్థమయ్యేలా చెప్పేదెవరు.. అసలు ఇలాంటి మంత్రాలు అనేవి ఉన్నాయా.. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేది నిజమేనా..అనే విషయాన్ని మనం తెలుసుకుందాం..?
అది ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మండల కేంద్రం. నిత్యం వేలాదిమంది అక్కడికి వస్తుంటారు పోతుంటారు. ఆ మండలంలోనే
పోలీస్ స్టేషన్ మొదలుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన మండలంలో సభ్యసమాజం సిగ్గుపడేలా చాలా దారుణ ఘటన జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే ఆలోచనతో ఇద్దరు దంపతులను అక్కడే చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. మరి ఈ ఘటనకు వారి యొక్క బంధువులే పాల్పడడం కొసమెరుపు. వెంటనే విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆపడంతో ఇద్దరు బతికి బయటపడ్డారని చెప్పవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళితే
మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రానికి చెందిన బోయిన రమేష్
రజిత దంపతులు. వారి ఇంటికి బంధువులు వచ్చారు.
వారు మాట్లాడుతూ ఉండగానే వచ్చిన బంధువులు కోపోద్రిక్తులై
రజిత మరియు రమేష్ లను బయటకు లాక్కొని వచ్చి తీవ్రంగా కొడుతూ అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభానికి కట్టేశారు. ఈ ఘటనను చూస్తున్నా స్థానికులు మాత్రం ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. వారు మంత్రాలు చేస్తున్నాడని నెపంతో వారి బంధువులు ఇలా దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ విషయం
పోలీస్ స్టేషన్ వెళ్లడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆ దంపతులిద్దరికీ సేవ్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కూడా ప్రారంభించామని అల్లాదుర్గం ఎస్సై
మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ ఘటన
స్థానిక మండల కేంద్రంలో కలకలం సృష్టించింది.