ఛీ ఛీ.. రైల్లో ఇదేం పాడు పని.. మహిళను చూస్తూ?
కానీ ఇక్కడ చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం దారుణంగా ప్రవర్తించాడు.. తాను మనిషిని కాదు పశువు అనుకున్నాడో ఏమో.. పశువుల కంటే హీనంగా ప్రవర్తించాడు. లోకల్ ట్రైన్ లో లేడీస్ కంపార్ట్మెంట్ లోకి రావడమే కాదు. ఒక మహిళ ముందు నిలబడి అసభ్యంగా చూస్తూ హస్త ప్రయోగం చేశాడు యువకుడు. అలా చేయటంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక మహిళ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలే రాత్రి 9 గంటల సమయంలో నుంగంబాక్కం నుంచి తాంబరం వెళ్తున్న లోకల్ ట్రైన్ లోకి మహిళ కంపార్ట్మెంట్లోఓ మహిళ ఎక్కింది. రైలు పల్లవరం స్టేషన్ దాటిన తర్వాత 23 ఏళ్ల యువకుడు లేడీస్ కంపార్ట్మెంట్ లోకి వచ్చాడు. ఇక ఆ మహిళను చూస్తూ హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు . అయితే లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎందుకు వచ్చావు అంటూ మొబైల్ లో వీడియో రికార్డ్ చేస్తూ అతని ప్రశ్నించింది సదరు మహిళ . దీంతో ఆ తర్వాత స్టేషన్లో రైలు దిగి పారిపోయాడు ఆ యువకుడు. ఇక ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు లక్ష్మణ్ గా గుర్తించారు.