సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్లారు.. అని ఇలా జరిగిందేంటి?

praveen
ఇటీవల కాలంలో విద్యార్థులు ఎప్పుడూ విహారయాత్రలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ కాలంలో పాఠశాలలు కళాశాలలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటున్నా విద్యార్థులు ఇక తమ స్నేహితులను కలవడానికి ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా విహారయాత్రలకు లాంగ్ డ్రైవ్ వెళ్లడం ఎంతో ట్రెండ్ గా భావిస్తూ ఉంటారు నేటి రోజుల్లో యువకులు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో తరచూ లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న యువకుల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. కానీ కొంతమంది ఇలా లాంగ్ డ్రైవ్ పేరుతో విహార యాత్రలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయ్.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిన ఆరుగురు విద్యార్థులు చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆరుగురు విద్యార్థులు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు కృష్ణరాజపురం గార్డెన్ సిటీ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులు తమిళనాడుకు చెందిన కారులో ఇటీవలే విహార యాత్రకు బయలుదేరారు. విహారయాత్ర ఎంతో సంతోషంగా పూర్తిచేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు.

 కానీ అంతలోనే ఊహించని ఘటన వారిని కబలించింది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై అతి వేగంగా ఉన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని గాల్లో పల్టీలు కొడుతూ అవతలి రోడ్డులో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కార్ నుజ్జు నుజ్జు  గా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతికష్టం మీద వాహనంలో ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సిరి కృష్ణ, అంకిత రెడ్డిలకు తీవ్రంగా గాయాలు కాగా.. వెంకట్, సిరిల్, వైష్ణవి, భరత్ అనే విద్యార్థులు మృతి చెందారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: