అలిగి వెళ్ళిన మైనర్ కు చుక్కలు చూపించిన కామాంధులు..
అనంతరం బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని భయపెట్టారు. అమ్మాయి అలా పడి ఉండటం గమనించిన కొందరు అమ్మాయిని దగ్గర లోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లొకి వెళితే.. బంగారుపేట తాలూకాలో ఈ దారుణం ఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ళ బాలిక అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. తన పుట్టిన రోజు నాడు కూడా కొత్త డ్రెస్ కొనివ్వలేదని అలిగి ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. అదే ఆమె చేసిన నేరం అని చెప్పాలి.
అలా బయటకు వచ్చిన యువతి.. ఆటోలో బంగారు పేటకు చేరుకుంది. బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని కొందరు గమనించారు. ఆనంద్‌కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణు అనే యువకులు బాలికకు పని ఇప్పిస్తామని నమ్మించి కామసముద్రం ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపెస్తామని బెదిరించి అక్కడ నుంచి పారిపొయారు.. అటుగా వెళ్తున్న కొందరు బాలిక పరిస్థితిని చూసి బంగారుపేట ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొన్ని గంటల సమయం లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు..