డబ్బుల కోసం మహిళలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా డబ్బున్న వారికి లైన్ వేస్తున్నారు. అంతే కాదు వారిని నమ్మించి లైంగిక ఆరోపణలు చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం పేరుతో ఓ స్కూల్ హెడ్మాస్టర్‌ను వేధించిన మహిళను, అలాగే భర్తను ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అతని పై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. అంతేకాదు వాళ్ళ దగ్గరి నుంచి 6 లక్షలు కూడా గుంజినట్లు తెలుస్తుంది.. అతను పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం తో అసలు విషయం బయటకు వచ్చింది.
మరో నాలుగు లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడి కొడుకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లొకి వెళితే..రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జైపాల్ సింగ్‌కు అదే గ్రామానికి చెందిన వనిత భర్వారీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది.. అది కాస్త చనువుగా మారింది. ఈ మేరకు రోజు ఫోన్ లో మాట్లాడుకొనెవారు. అయితే ఒక రోజు అతణ్ణి డిన్నర్ కు రమ్మని ఇంటికి పిలిచింది.
అది నిజమే అనుకొని వెళ్ళిన అతనికి భారీ షాక్ తగిలింది. ఒక గదిలోకి తీసుకెళ్ళి తలుపు వేసింది. అనంతరం ఆమె నగ్నంగా మారిపొయింది. అతడిని కూడా నగ్నంగా మార్చింది. అప్పుడే అమె భర్త చాటుగా ఫోన్ లో వీడియో తీసాడు.10 లక్షల నగదు ఇవ్వాలని లేకపోతే వీడియో పోలీసులకు చూపించి అత్యాచార కేసు పెడతానని బెదిరించాడు. అతను భయపడి తన కొడుకుకు ఫోన్ చేసి 6 లక్షలు తీసుకు రమ్మని చెప్పాడు. అయిన అతణ్ణి వదల్లేదు. మరో 10 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు భార్యా భర్తలను అరెస్ట్ చేశారు.