మృత్యువు వెంటాడింది.. చివరికి ప్రాణం పోయింది?

praveen
మనుషులు పగబడతారు  అన్నది చూశాం.. ఇక పక్షులు జంతువులు కూడా పగ పడతాయ్ అన్నది విన్నాం... కానీ మృత్యువు పగ బట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా.. కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మృత్యువు కూడా పగ పడుతుంది అన్నది అర్ధమవుతుంది. అంతేకాదు ఈ ఘటన తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరికైనా సరే గాయాలతో బయటపడుతూ ఉంటారు. మరి కొంతమంది  ప్రాణాలు పోగొట్టుకోవడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తికి రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది అనుకున్నాడు..

 కానీ అంతలోనే మరో రోడ్డు ప్రమాదం.. దీంతో చివరికి ప్రాణాలు పోయాయి.  ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చిం ఈ ఘటన. ది ఓ యువకుడిని మృత్యువు వెంటాడింది.  ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్న యువకుడిని తొలుత ఒక ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకొని మళ్ళీ ట్రక్ లో భోజనం చేస్తున్నాడు. ఇక అంతలోనే వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు  ఈ ఘటనతో స్థానికులు సైతం ఒక్కసారిగా షాక్ అయి పోయారు అని చెప్పాలి.

 కర్నూలు జిల్లా సున్నిపెంట కు చెందిన ఉమర్ ఇటీవలే మధ్యాహ్నం శ్రీశైలం నుంచి ట్రక్కు నడుపుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్దరవీడు సమీపంలోకి రాగానే ఆర్టిసి బస్సు ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్ ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. సదరు యువకుడు  మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు సదరు యువకుడు. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి ఇక దెబ్బలకు కట్టు కట్టించుకున్నాడు.  ఆ తర్వాత అదే ట్రక్కులో యజమాని తో కలిసి ఉమర్ భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో మార్కాపురం నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా యజమాని మల్లికార్జున కు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: