తెల్లవారుజామునే దారుణం.. ప్రాణం పోయింది?

praveen
టెక్నాలజీ పెరిగిపోతుంది.. మనిషి ఆలోచన కూడా కొత్త పుంతలు తొక్కుతోంది.. ఆధునిక జీవనశైలిలో అన్నీ మారిపోతున్నాయి.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. కానీ మనుషుల్లో మానవత్వం కూడా కనుమరుగైపోతు ఉండడం మాత్రం మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు సాటి మనుషులకు సహాయం చేస్తూ మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు మనిషి. ఇప్పుడు మాత్రంసహాయం చేయడం పక్కన పెడితే కనీసం మనుషుల ప్రాణాలకు విలువ కూడా ఇవ్వడం లేదు. కనీసం జాలి దయ లేకుండా మనుషుల ప్రాణాలు తోడేస్తున్న తోడేళ్ల లాంటి మనిషులే సభ్యసమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు.


 దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో మునిగిపోతున్నారు సగటు మనిషి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట దారుణంగా హత్యలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి   ఇటీవలే కేరళలోని తిరువనంతపురంలో కూడా పట్టపగలే దారుణమైన హత్య జరిగింది.  లాడ్జి రిసెప్షనిస్ట్ గా  ఉన్న వ్యక్తిపై  కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇక అక్కడే సీసీ కెమెరా ఉంది. ఇక పోలీసులకు దొరికిపోతాము అని కూడా ఆలోచించలేదు.. మారణాయుధాలతో అక్కడికి చేరుకున్న దుండగులు రిసెప్షనిస్ట్ పై దారుణంగా దాడి చేసారు. చివరికి ప్రాణాలు తోడేసారూ ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది.


 ఈ ఘటన ఓవర్ బ్రిడ్జ్ లోని సిటీ టవర్ హోటల్ లో జరిగినట్లు తెలుస్తుంది. కాగా మృతుడు తిరువనంతపురంలోని నాగర్ కోయిల్ కు చెందిన అయ్యప్పన్ గా గుర్తించారు పోలీసులు.  తెల్లవారుజామునే కొంతమంది దుండగులు బైక్పై వచ్చి అతని దారుణంగా కొట్టారు. టేబుల్ పై పడేసి మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు సదురు రిసెప్షనిస్ట్. ఇక సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించి హత్య చేయాలని ఉద్దేశంతోనే నిందితులు అక్కడికి వచ్చారు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక సిసిటివి విజువల్స్ సేకరించిన పోలీసులు దీని ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: