భర్త అప్పులు చేస్తే.. భార్య పోలీస్ స్టేషన్ కి .. ప్రాణం పోయింది?
ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ తనువు చాలిస్తూ ఉండడంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. ఇక్కడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ల పాటు ఆ వివాహిత భర్తతో కలిసి హాయిగా నే ఉంది. కానీ ఆ తర్వాత కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట అప్పులు చేస్తూ తిరగడం మొదలుపెట్టాడు భర్త. ఇక ఇలా భర్త చేసిన అప్పులు చివరికి భార్య ప్రాణం పోయే పరిస్థితులు తీసుకువచ్చింది. భర్త చేసిన అప్పులకు గాను భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించారు పోలీసులు.
ఇక పోలీస్ స్టేషన్లో తీవ్రంగా అవమానించడం తో మనస్థాపం చెందింది సదరు వివాహిత. దీంతో జీవితం వృధా అని అనుకుని చివరకు బలవన్మరణానికి పాల్పడింది. దొడ్డబళ్ళాపురం నెలమంగళ పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అఖిల భర్త కుమార్తో కలిసి ఉంటుంది. అయితే ఇటీవలే భర్త స్థానికంగా ఉండే చందన్ అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇక అప్పు తిరిగి చెల్లించాలని కోరినప్పటికీ రోజులు గడుస్తున్నాయి తప్పా అప్పు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక తరచూ అప్పు కోసం ఇంటికి వచ్చి అఖిల ను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉండేవాడు చందన్. ఇటీవల పోలీసులు శుక్రవారం పిలిపించి హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన వివాహిత చివరికి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.