యూట్యూబ్ లో చూసి ఆ పని చేశాడు.. కానీ చివరికి?

praveen
నేటి రోజుల్లో యూట్యూబ్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సమాచారం కావాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేయడం ఇక అక్కడ తెలుసుకోవడం చేస్తున్నారు. అన్ని రకాల సమాచారాలు కూడా ప్రస్తుతం యూట్యూబ్ లో నే దొరుకుతున్నాయి. ఇలా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ మీద అవసరానికంటే కాస్త ఎక్కువగానే ఆధార పడి పోతున్నారు అని చెప్పాలి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ కొంతమంది మాత్రం నేరాలకు పాల్పడడం ఎలా అన్నది కూడా యూట్యూబ్లో నేర్చుకుంటున్నారు.


 ఏం చేస్తాం దురదృష్టం కొద్దీ అలాంటి వివరాలు కూడా యూట్యూబ్ లో దొరుకుతున్నాయి. మరి ఇలా యూట్యూబ్ లో చూసి నేర్చుకుని నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే హైదరాబాద్ నగరంలోని బి హెచ్ సి ఎల్ పోస్ట్ ఆఫీస్ చోరీ కూడా ఈ కోవలోకే వస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో స్వీపర్ గా పనిచేస్తూ ఉంటాడు తెల్లాపూర్ కు చెందిన ఎండి జహీర్. ఇక ఇటీవల పోస్టాఫీసులో చోరీ జరగగా తమదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతని దగ్గర నుంచి ముప్పై మూడు లక్షలు నగదు చోరీ ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


 ఈ క్రమంలోనే పోలీస్ విచారణలో బయట పడినా షాకింగ్ విషయాలను ప్రెస్ మీట్ పెట్టి వివరించారు పోలీసులు.  పోస్టాఫీసులో చోరీ జరిగిన నాటి నుంచి అక్కడ పనిచేసే జహీర్ విధులకు హాజరుకాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే  తన అదుపులోకి తీసుకొని విచారించగా  ఇక నేరం అంగీకరించాడు జహీర్. దొంగతనం చేసిన వాటిలో  లక్షలకు పైగానే ఖర్చు చేశాడు. మిగతా డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జహీర్ యూట్యూబ్ లో వీడియోలు చూసి  చోరీ చేయడం ఎలా అనితెలుసుకొని మరీ ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డాడు అన్న విషయం విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: