షాకింగ్ : బ్రష్ చేసినందుకు ప్రాణం పోయింది?
ఇలా సదరు యువతి ప్రాణాలు కోల్పోవడం వెనుక ఒక వింత ఘటన దాగి ఉంది. టూత్ పేస్ట్ అనుకొని ఎలుకల మందు తో బ్రష్ చేసింది. దీంతో అస్వస్థతకు గురైన ఆ యువతి చివరికి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని సూర్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మార్కంజ గ్రామానికి చెందిన శ్రావ్య ఇంటర్ చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తోంది.. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో ఇంటికి వచ్చేసింది.
ఇటీవలే రాత్రి పడుకునే సమయంలో బ్రష్ చేసుకుంది శ్రావ్య. అయితే ఇంట్లో టూత్ పేస్ట్ ఉండాల్సిన ప్లేస్ లో తెల్లని పేస్టు రూపంలో ఎలకల మందు ఉంది. ఇక అది గమనించకుండా టూత్ పేస్ట్ కు బదులు ఎలకల మందు తో బ్రష్ చేసుకుంది. టేస్ట్ కాస్త తేడా కొట్టడంతో వెంటనే నోరు పుక్కిలించింది. శ్రావ్య తర్వాత కాసేపటికి నిద్రపోయింది. కానీ చివరికి అస్వస్థతకు గురైంది. ఇక రోజుల గ్యాప్ లోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆ తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్స తీసుకుంటూ చివరికి తుది శ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది..