ఇంటి గడపలో కూర్చున్నారు.. అంతలో ప్రాణం పోయింది?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకువచ్చి ప్రాణాలు తీస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో కొన్ని ఘటనలు చివరికి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటాయి. ఇలా క్షణాల వ్యవధిలో మృత్యువు దూసుకు వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇక కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు భూమి మీద నూకలు బాకీ లేనప్పుడు ఇక ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వృధా అవుతుంది అన్నది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఊహించని రీతిలో ఒక వ్యాను వేగంగా దూసుకు రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా అక్కడికక్కడే నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలుసుకున్న తర్వాత దేవుడి చేతిలో మనుషుల జీవితాలు కీలుబొమ్మలు అనడానికి ఈ ఘటన నిదర్శనం గా మారింది అని అనుకుంటున్నారు అందరూ. ఇంటిదగ్గర ఖాళీగా కూర్చున్న వారు చివరికి అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయారు.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. కుటుంబ సభ్యులు ఇంటి గడప లో కూర్చున్నారు . ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. కానీ వారి నవ్వు విధికి నచ్చ లేనట్టుంది. ఈ క్రమం లోనే వ్యాను రూపం లో మృత్యువు దూసుకొచ్చింది. గడప దగ్గర కూర్చున్న వారిపై ఒక వేగంగా దుసుకు రావడం తో ఈ ప్రమాదం లో నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కడప జిల్లా సికె దిన్నె మండలం మద్ది  మడుగు లో జరిగింది. ఈ ఘటన తో ఇక ఆ ప్రాంతం  లో ఒక్క సారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: