అక్రమ సంబంధాలు ఎక్కడ చూసిన వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా తెలంగాణాలో ఇలాంటి ఘటనలు నార్థ్ రాష్ట్రాలను దాటిపోతూన్నాయి అని ఇప్పుడు వెలుగు చూస్తున్న ఘటనల ను చూస్తె క్లియర్ గా అర్థమవుతోంది.. భర్త ప్రవర్తన పై అనుమానం వచ్చిన భార్యలు అతని పై నిఘా పెడుతున్నారు. ఒకవేళ రెండో సేటప్ ఉందని రుజువైతే మాత్రం భర్త అనే సంగతి పక్కన పెట్టి తోలు తీసి డోలు వాయిస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ మహిళ అదే చేసింది. భర్త వేరే మహిళ తో ఉన్న సమయంలో భర్తను పట్టుకొని చిథక బాదింది. మహిళలు ఎందులొనూ తక్కువ కాదని నిరూపించింది.
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కు చెందిన శాంత కుమారికి నాగార్జున సాగర్ కు చెందిన డీ.ఎల్ ప్రసాద్ తో 16 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.. అయితే ఉద్యోగం కోసం బయటకు వెళుతున్నా అని చెప్పిన అతను ఏఆర్ కానిస్టేబుల్ నల్గొండలో పని చెస్తున్నారు. అయితే భార్యా పిల్లల ను వదిలేసి అతను నల్గొండ లో ఉంటున్నారు. ఆ క్రమంలో ఓ మహిళ తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం రోజు రోజుకు పెరిగిపొయింది.
దాంతో ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోయారు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్జీవోస్ కాలనీలో ప్రియురాలి తో కలిసి కాపురం చేస్తున్నారు. ఆమె మోజులో పడి భార్యా పిల్లల ను పట్టించుకోవడం మానేశాడు. అసలు ఇంటికి రావడమే మానేశాడు. అనుమానం వచ్చిన భార్య అతని వ్యవహారాన్ని బయట పెట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి భర్తను రెడ్ హాండెడ్ గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అతణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..