ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. బస్సులో 60 మంది ప్రయాణికులు.. చివరికి?

praveen
డబ్బులు ఉన్నవాళ్లు అయితే తమకు ఇష్టం వచ్చిన విధంగా కార్లో లేదా ప్రత్యేకమైన వాహనంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ప్రయాణం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇలా ఖరీదైన వాహనాలలో మరీ ముఖ్యంగా సొంత వాహనాలలో వెళ్లలేరు. కాబట్టి అటు ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంచిన రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే  అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో సురక్షితమైన ప్రయాణం ఉంటుంది అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడు



 ఈ క్రమంలోనే ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం కంటే ఆర్టిసి బస్సు లో వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవలే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఎంతో మంది ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా బస్సు డ్రైవర్ బస్సు నడుపుతూ డ్యూటీలో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చింది.. దీంతో సదరు బస్ డ్రైవర్ ఏకంగా బస్సులోనే ప్రాణాలు వదిలిన ఘటన ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది. రవి అనే ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడుపుతున్న సమయంలో గుండె పోటు వచ్చింది.


 అయితే ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆఖరు ఆంబులెన్స్ లో నే మృతిచెందాడు ఇలా ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ బస్సులోనే  మృతిచెందిన సమయంలో వెంటనే స్పందించిన ఒక ప్రయాణికులు బస్సు ను కంట్రోల్ చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చిన సమయంలో ఏకంగా బస్సులో 69 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది అని చెబుతోంది. బస్సు డ్రైవర్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: