గిఫ్ట్ ఇస్తానని పిలిచి.. తల మొండెం వేరు చేశాడు?
ఇటీవల ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదు అన్న కారణంతో దారుణంగా అత్యంత కిరాతకంగా హతమార్చాడు ప్రియుడు. యూపీ లో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విష్ణు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ అంతలోనే యువతి ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అటు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని నిర్ణయించుకున్న స్వప్న వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు విష్ణును దూరం పెట్టింది.
ప్రియురాలు తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణు ఇటీవలే సదరు యువతిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. చివరికి గిఫ్ట్ ఇస్తానని చెప్పి తర్వాత యువతి పెళ్లి విషయంపై వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన సదరు యువకుడు ఆపై దారుణంగా దాడి చేసాడు. తన దగ్గర ఉన్న కత్తితో ప్రియురాలు తల నరికి తల మొండెం వేరు చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు..