అయ్యో పాపం.. ఈ రైతుకు ఎంత కష్టం వచ్చిందో..

Satvika
రైతులు దేశానికి వెన్నెముక అని అందరికి తెలుసు.. అతను రెక్కలు ముక్కలు చేసుకొని పండిస్తె కానీ మన నాలుగు వేళ్ళు నోటిలోకి పోవు. అందుకే ఈ ప్రపంచంలో రైతులు అతి పెద్ద సంపన్నులు అని ప్రముఖులు అంటున్నారు.. రైతుల కష్టాలు చెప్పలెనివి. ఒక్కో ఏడాది ఒక్కో పరిస్థితులను ఎదుర్కోవాలి. దిగుబడి వస్తే గిరాకి ఉండదు. గిరాకి వున్నప్పుడు పంట ఉండదు.. అందులో కరోనా మహమ్మరి దేశంలోకి వచ్చిన తర్వాత రవాణా లేక రైతులు తీవ్ర నష్టాలను చూసారు. ఎంతో మంది అప్పుల బాధలను భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపొయారు.


ఇప్పుడు ఓ రైతు ఇక రైతుగా పుట్టను అని సూసైడ్ చేసుకొని చనిపోయాడు.. ఇది నిజంగా యావత్ ప్రజలను కంటతడి పెట్టిస్తుంది. మరో జన్మంటూ ఉంటే రైతు కుటుంబంలో పుట్టబోనని, ఆవేదన వ్యక్తం చేస్తూ విషం తీసుకున్నాడు. రెండు రోజుల ఆస్పత్రిలో ప్రాణాల తో పోరాడి చివరికి కన్నుమూశాడు. వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని షోలాపూర్‌ జిల్లా మగర్వాడీ గ్రామానికి చెందిన సూరజ్‌ జాధవ్‌ అనే వ్యక్థిది రైతు కుటుంబం. మూడు రోజుల క్రితం ఆయన 'రైతులను గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు కుటుంబంలో మళ్లీ పుట్టాలనుకోవడం లేదు' అంటూ ఓ మందును తాగాడు.


సూసైడ్ చేసుకుంటూన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను మందు తాగిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు పండర్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చెర్పించారు. అయితే రెండు రోజులు పాటు అతను వైద్యానికి సహకరింఛాడు. చివరికి అతను ప్రాణాలును వదిలాడు.ఆల్కహాల్‌ కూడా తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. అతడి బలవన్మరణానికి రుణ భారం తదితర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అతనికి విద్యుత్ కనెక్షన్ ను కూడా కట్ చేయడం వల్ల చనిపోయాడని అధికారులు చెబుథున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: