కన్నకొడుకునే చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?
ఈ దారుణమైన ఘటన కనిగిరిలో వెలుగులోకి వచ్చింది. ఇందిరా కాలనీ లో ఉండే రాచురి హుస్సేన్, వరమ్మా దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వీరాంజనేయులు. అయితే ఇటీవలి కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న హుస్సేన్ తరచూ శారీరకంగా హింసిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే 20 ఏళ్ళ కొడుకు వీరాంజనేయులు తండ్రినీ అడుక్కుంటూ ఉండేవాడు. ఇటీవలి కాలంలో హుసైన్ మద్యం గంజాయి కి బానిస గా మారిపోయాడు.
ఇటీవలే ఫుల్లుగా మద్యం తాగి భర్తతో గొడవపడేందుకు ఇంటికి వచ్చాడు హుస్సేన్. కానీ ఆ సమయంలో భార్య ఇసుక ట్రాక్టర్ పనికి వెళ్ళింది. ఇక ఇంట్లో వీరాంజనేయులు నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య లేకపోవడంతో కోపంతో ఊగిపోయిన హుస్సేన్ నిద్రిస్తున్న కొడుకు వీరాంజనేయులు విషయంలో కిరాతకంగా ఆలోచించాడు. ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపై గట్టిగా కొట్టాడు. ఇక ఇలా తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న వీరాంజనేయులు ను చూసి మాత్రం కనికరించకుండా కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అంతేకాదు కొడుకుని చంపేసాను అంటూ పెద్దగా అరవడం కూడా మొదలు పెట్టాడు. కదాకాగా అక్కడికి చేరుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు పోలీసులు..