మహిళపై 12 మంది గ్యాంగ్ రేప్.. ఎక్కడంటే?

praveen
మహిళల రక్షణకు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నారు.  మహిళల  పై అత్యాచారం చేసిన వారిని దారుణం గా శిక్షిస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు పోలీసులు ఏకంగా ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా అటు కామాంధుల తీరు లో మాత్రం మార్పు రావడం లేదు. ఆడ పిల్లల పై అత్యాచారం చేస్తే ప్రాణం పోతుంది అన్న భయం ఎవరి లో కనిపించడం లేదు. రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గు  ముఖం పట్టడం లేదు. కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మనుషులు కాస్త మానవ మృగాలు గా మారి పోయి దారుణం  గా హత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.


 ఇలా నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల జీవితాన్ని అడుగడుగునా ప్రశ్నార్థకం గానే మార్చేస్తున్నాయి. అయితే ఇక పక్కనే ఏకంగా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారి పై దాడి చేసి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్నారు నేటి రోజుల్లో కామాంధులు. ఇలా దేశం లో ఎక్కడో ఓ చోట ప్రతి రోజు ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలోని కరీంనగర్ జమ్మికుంట లో ఒక దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



 ఒక వివాహిత పై 12 మంది యువకులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మూడు రోజులుగా ఒక రూమ్ లో బంధించి తనపై అత్యాచారం చేశారంటూ బాధిత మహిళ ఇటీవలే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది. తనపై పైశాచికంగా ప్రవర్తించాడు అంటూ ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ. వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం  ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 10 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: