ఆ చిన్న కారణంతో.. తండ్రిని చంపిన కొడుకు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే పాత రోజులే బాగుండేవి ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పరాయి వాళ్ల విషయంలో  ఎలా వ్యవహరించిన.. సొంత వాళ్ల విషయంలో మాత్రం ఎంతో ప్రేమాభిమానాలు చూపించే వారు. ఇప్పుడు మాత్రం పరాయి వాళ్ల విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా జాలి దయ కరుణ అన్న విషయాలను మరచిపోతుంటారు. చివరికి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఏకంగా ఆస్తుల కోసం కనీ పెంచిన తల్లిదండ్రులను హత మారుస్తున్న పిల్లలు నేటి రోజుల్లో ఎక్కువై పోతున్నారు.


 ప్రేమను పంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లి దండ్రుల విషయం లో కాస్తయినా మానవత్వాన్ని చూపించ లేకపోతున్నారు వారి కడుపున పుట్టిన పిల్లలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా వృద్ధుడైన తండ్రి విషయం లో మానవత్వాన్ని మరిచి పోయిన కొడుకు దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తండ్రి మృత దేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి నిప్పంటించి తగలబెట్టాడు. ఉత్తర ప్రదేశ్లోని మధురలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నర హోలీ గ్రామానికి చెందిన ఆమె తన తండ్రిని ఇలా హత్య చేశాడు.


 అమృతలాల్ అనే వ్యక్తి ప్రస్తుతం వృద్ధాప్యం నేపథ్యం లో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇకపోతే ఇటీవలే అమృతలాల్ భార్య ఆశాదేవి ఇటీవల తండ్రి కొడుకులను ఇంట్లో వదిలి పెట్టింది. ఇక తండ్రి తో ఒంటరిగా ఉన్న వినీత్ ఇళ్ళు విక్రయించాలని తండ్రి పై  ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. కానీ అతడు మాత్రం ఒప్పుకోలేదు.  ఇదే విషయం లో కోపం తో ఊగి పోయాడు కొడుకు వినీత్. ఇక దారుణం గా తండ్రి గొంతు కోసి దుప్పటితో చుట్టి మృతదేహాన్ని కాల్చివేశాడు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు నిందితుడు కొడుకు అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: