దారుణం కూతురు అలా చేసిందని.. గొంతు కోసిన తండ్రి?

praveen
మనుషులు మానవ మృగాలుగా పోతున్నారు. ఇది ఎవరో చెబుతున్నది కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చెబుతున్నాయి. ఏకంగా సొంత వాళ్ల విషయంలో కనీసం జాలి దయ చూపించలేక పోతున్నా మనుషులు ఉన్మాదిగా మారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మనిషి ప్రాణాలు తీసిన తర్వాత జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చిప్ప కూడు తినాల్సి వస్తుంది అని భయం మాత్రం కనిపించడం లేదు. వెరసి రోజురోజుకు  దారుణమైన హత్యలు జరుగుతున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 కన్న కూతురిని కంటికి రెప్పలా కాచుకోవలసిన తండ్రి కాలయముడు గా మారిపోయాడు. కష్టం వస్తే నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వాల్సిన తండ్రి చివరికి ఉన్మాదిగా  మారిపోయాడు. వద్దు నాన్న ప్లీజ్ నీకు దండం పెడతాను అంటూ ఎంతో బ్రతిమిలాడిన ఆ తండ్రి మనసు మాత్రం కరగలేదు. చివరికి కన్న కూతురు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఇక్కడ ఒక కిరాతక తండ్రి. ఆ సమయంలో మృతదేహాన్ని పొలాల్లో పడేసి వెళ్ళిపోయాడు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ లో వెలుగులోకి వచ్చింది. గోపాల్గంజ్ జిల్లాలోని కాటా గ్రామంలో ఇంద్ర దేవ్ అనే వ్యక్తి తన భార్య కూతురు తో కలిసి ఉంటున్నాడు.


 అయితే ఇటీవలే కూతురు కిరణ్ కుమారి అదే గ్రామంలో ఉండే ఓ యువకుడితో స్నేహపూరితంగా ఉండటం మొదలు పెట్టింది.  చివరికి స్నేహం ప్రేమగా మారిపోయింది. అయితే ఈ విషయం తండ్రి ఇంద్ర దేవ్ కు తెలిసింది. దీంతో కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నాడు. పెళ్లి కోసం ఒక సంబంధాన్ని కూడా చూసాడు. అతని కూతురు మాత్రం పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. తాను ఒకరిని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి రాత్రి ఫుల్లుగా తాగొచ్చి తన సోదరులతో కలిసి కూతురు గదిలోకి వెళ్లి చేతులు కాళ్లు కట్టేసి గొంతు కోశాడు. కూతురు మృతదేహాన్ని పొలంలో పడేసాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: