ఓరినాయనో.. ఫుల్లుగా తాగిస్తాడు.. తర్వాత పని కానిస్తాడు?
దీంతో ఇటీవల కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక వ్యక్తి రొటీన్ దొంగ కాదు.. కాస్త డిఫరెంట్. అందరిలా కాదు.. మద్యం షాపు వద్ద అతడు దొంగతనం చేస్తూ ఉంటాడు. మద్యం షాపు వద్ద వ్యక్తులతో పరిచయం చేసుకుని.. ఫుల్లుగా మద్యం తాగించి చివరికి నగదును ఎత్తుకు వెళుతూ ఉంటాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వరంగల్కు చెందిన సందీప్ గత కొంతకాలంగా మైలారు దేవరపల్లి పరిధిలో లక్ష్మిగూడ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం చేస్తే నెలకు జీతం వస్తుంది. ఇక వ్యాపారం చేస్తే లాస్ వస్తుంది. ఈజీగా మనీ సంపాదించడం ఎలా అని ఆలోచించాడు.
దీంతో ఒక కొత్త చెత్త ఆలోచన అతని మైండ్లో తట్టింది. ఈ క్రమంలోనే వైన్ షాప్ కళ్ళు కాంపౌండ్ వద్ద వ్యక్తులను పరిచయం చేసుకుంటాడు. వారితో కలిసి మద్యం సేవించి మాటల్లోకి దింపుతాడు. ఇక ఆ తరువాత మాటల్లో పెట్టి వారి వద్ద నుంచి నగదు సెల్ఫోన్ దొంగలించి పరార్ అవుతాడు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీరామ్ కాలనీకి చెందిన నరసింహం కు మద్యం తాగించి అతని జేబులో ఉన్న ఏటీఎం కార్డు దొంగలించాడు. అకౌంట్ నుంచి సుమారు రెండు లక్షల 15 వేల రూపాయల దొంగలించాడు. ఈ క్రమంలోనే ఇక బాధితుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చివరికి అతని అరెస్టు చేశారు.