మహిళా దినోత్సవం రోజే.. ఇంత ఘోరం జరిగిందా?

praveen
కామంతో మానవ మృగాలు గా మారి పోతున్న మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపించింది అంటే చాలు  దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలా ఇటీవలి కాలం లో తరచూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగు లోకి వస్తు ఆడ పిల్లల భద్రత ప్రశ్నార్థకం గా మార్చేస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరులో ఓ దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక విదేశీ మహిళ పై అత్యాచారయత్నం జరగడం కలకలం రేపింది. ఏపీ లోని అందమైన ప్రదేశాల్లో తిరగాలని అనుకుని ఇక్కడకు వచ్చింది ఆ విదేశీ మహిళ.

 దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నారు కామాంధులు. ఇక ప్లాన్ ప్రకారమే విదేశీ మహిళకు మాయ మాటలు చెప్పి కాస్త దగ్గరయ్యారు. చివరికి అత్యాచారం యత్నం చేశారు. లిథువేనియా కు చెందిన మహిళ గోవా వెళ్లేందుకు శ్రీలంక నుంచి చెన్నై చేరుకుంది. బెంగళూరు వస్తుండగా బస్సులో నెల్లూరు జిల్లాకు చెందిన సాయి పరిచయమయ్యాడు. గోవా మిస్సయిన పర్వాలేదు కానీ కృష్ణాపురం మాత్రం తప్పనిసరిగా చూడాలి అంటూ మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఈ క్రమం లోనే మహిళతో కలిసి గూడూరుకు చేరుకున్నారు సాయి కుమార్.

 ఇక అక్కడే కాపుకాసి ఉన్న మరో స్నేహితుడితో కలిసి సైదాపురం అడవిలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. కానీ వారి వక్రబుద్ధి ని పసిగట్టిన ఆమె చాకచక్యంగా వ్యవహరించి యువతుల బారి నుంచి తప్పించుకుంది.. కేకలు వేస్తూ పరుగులు తీసి రోడ్డు పైకి చేరింది. ఇక ఆమె అరుపులు విని కొంత మంది ప్రయాణికులు పోలీస్ స్టేషన్ లో ఆమెను  అప్పగించారు. మహిళ దగ్గర సాయి కుమార్ ఆధార్ కార్డు పాన్ కార్డు గుర్తించారు. ఈ కేసును సవాల్గా తీసుకుని పోలీసులు ఆరు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: