షాప్ కి వెళ్లిన బాలిక.. అంతలోనే కామంధుడి కన్ను పడింది.. చివరికి?

praveen
ఒకప్పుడు రోడ్డుమీద తిరిగే ఆకతాయిల మాత్రమే ఆడ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడడం లేదా అత్యాచారాలు చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి మంచి చెడు ఏంటి అని చెప్పాల్సిన వయసులో ఉన్న పెద్దలు సైతం కామంతో ఊగిపోతూ దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా కూతురు మనవరాలు వయస్సున్న బాలికలపై కూడా కామవాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా పెద్దలను చూసి ఇక సభ్యసమాజం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. ఇలా వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు ఆడపిల్ల రక్షణను అంతకంతకూ ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా 7 ఏళ్ల బాలిక పై కన్నేసిన 45 ఏళ్ల వ్యక్తి చివరికి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఇక ఆ బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి  45 ఏళ్ల వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన భూపాల్ లో  వెలుగులోకి వచ్చింది. ఇటీవలే  7 ఏళ్ల బాలిక ఆయిల్ ప్యాకెట్ తీసుకువచ్చేందుకు సమీపంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళింది. అయితే బాలిక ఒంటరిగా కనిపించడంతో 45 ఏళ్ల  ముస్తాక్ లో కామాంధుడు బయటికి వచ్చాడు.



 ఈ క్రమంలోనే బాలికను ముద్దుగా దగ్గరికి పిలిచి ఇలా అసభ్యంగా తాగడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతని ప్రైవేట్ పార్ట్ ను కూడా బయటపెట్టాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయింది ఆ బాలిక. తన తల్లి పిలుస్తోంది అంటూ చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీశారు. అయితే అతని కుటుంబం మాత్రం ఇక ఈ ఆరోపణను ఖండించడం తో చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడు మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న  విషయం తేలింది పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: