దారుణం : ఆటోలో వెళ్ళింది.. కాని ఇలా జరుగుతుంది అనుకోలేదు?
మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసిన కామాంధులు ఏదోవిధంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీ విద్యార్థిని సాయంత్రం సమయంలో ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో ఆ యువతి పై కన్నేసిన ఆటోడ్రైవర్ స్నేహితులకు సమాచారం అందించాడు. ఇక మరో ఇద్దరితో కలిసి సదరు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా దారుణంగా బాధితురాలిని శారీరకంగా హింసించి వీడియో రికార్డు చేయడం కూడా చేశారు.
ఇక జరిగిన విషయం ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వారి బారి నుంచి బయటపడిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. నిందితుల వివరాలు తెలపగా.. ఇక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు కూడా బర యాదవ్, యష్ పాల్ గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఇక నిందితులకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన జరిగిన నాటి నుంచి స్థానికంగా ఉన్న విద్యార్థునులు అందరూ కూడా ఆటోలో వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఘటనతో ఆందోళనలో మునిగిపోయారు.