నటి ఇంట్లోకి దొంగలు.. బట్టలు విప్పించి దారుణం?

praveen
ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎక్కడైనా కనిపించింది అంటే చాలు ఇక ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీంతో ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే యజమానులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక కొన్ని కొన్ని సార్లు ఇంట్లో యజమానులు ఉన్నప్పటికీ ఎంతో చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 వారిద్దరూ ఎంతో పేరు మోసిన దొంగలు.. ఇక పోలీసులకు మోస్ట్ వాంటెడ్.. తాళాలు వేసిన ఇంటికే కాదు ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే చాకచక్యంగా దొంగతనాలు చేయడం లో ఆరితేరారు ఆ ఇద్దరు దొంగలు. ఇక ఈ సారి తమిళనాడులో తమ చేతివాటం చూపించారు. వలసరవక్కం లోని ఒక సినీ నటి ఇంట్లో దొంగతనం చేయడానికి చొరబడ్డారు. ఆ సినీ నటి ఇప్పటి వరకు పలు సీరియళ్లలో కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్తతో గొడవ జరగడంతో ప్రస్తుతం ఇంట్లో ఒంటరి గానే ఉంటుంది. ఇటీవలే ఈ విషయం తెలుసుకున్న దొంగలు కన్నదాసన్, సెల్వకుమార్ లు ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లారు.


 ఇక కిటికీలోంచి వెళ్లడం రహస్యంగా వెళ్లడమో చేయలేదు. ఏకంగా 10:30 గంటల సమయంలో తలుపు కొట్టారు. ఇక ఎవరా అని తలుపు తీయగానే ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించి కత్తితో బెదిరించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత దుస్తులు మొత్తం విప్పేయ్ అంటూ కత్తితో బెదిరించారు. అరవాలని ప్రయత్నిస్తే పొడిచేస్తానంటూ అన్నారు. దీంతో చేసేదేమీ లేక నటి దుస్తువులు విప్పేసింది. దీంతో తమ వద్ద ఉన్న సెల్ఫోన్ లో పూర్తిగా ఆమె నగ్నంగా ఉండడాన్ని చిత్రీకరించారు. తర్వాత బీరువా తాళాలు తీసుకుని నగలు తీసుకొని పారిపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేసింది నటి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పాత నేరస్తులుగా గుర్తించిన పోలీసులు 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: