అలాంటి కాల్స్ చేశారో... ఇక జైలుకే?
ఎందుకంటే నేరాలను అరికట్టడానికి లో సూత్రధారుల తో పాటు పాత్రలను కూడా అరెస్టు చేయడం తప్పనిసరి అని అందుకే టెలీకాలర్ లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాము అంటూ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక ఇటీవలే జాబ్ ఫ్రాడ్ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళలను అరెస్టు చేయగా.. మరో 60 మందికి కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం. లోన్ యాప్స్,జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, కేవైసీ అప్డేట్ లాంటి వాటిపై జరిగే నేరాలకు ఉత్తరాది తో పాటు బెంగుళూరులో ఉన్న కాల్ సెంటర్లు అడ్డాలుగా మారిపోయాయి. కొంతమంది మోసగాళ్లు ప్రత్యేకంగా టెలీకాలర్ లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఎంతో మందికి ఫోన్లు చేయిస్తున్నారు.
ఎదుటివారితో ఆకర్షణీయంగా మాట్లాడి వల వేయడానికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక ఇలా టెలీకాలర్ గా పని చేస్తున్న వారిలో అత్యధిక మంది మధ్య, దిగువ మధ్యతరగతి యువతులే ఉండడం గమనార్హం. అయితే గత కొన్ని రోజుల వరకు సూపర్వైజర్లు మేనేజర్లను మాత్రమే అరెస్టు చేసే వారు. టెలీకాలర్ లకు కౌన్సిలింగ్ చేసి వదిలిపెట్టారు. ఇక కాల్ సెంటర్ నుంచి బయటికి వచ్చి మరో కాల్ సెంటర్ లో చేరి ఇక ఇదే పని చేస్తున్నారు టెలీకాలర్లు. దీంతో వారిని కూడా అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పూర్తిగా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు నమ్ముతున్నారు.