అయ్యో పాపం.. కళ్ళు లేవన్న కనికరం లేకుండా దారుణం..

Satvika
కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు.. వావి వరుసలు లేకుండా కంటికి కనిపించిన ఆడవాళ్ళ పై అరాచకం చేస్తున్నారు. ఆడది అయితే చాలు క్షణాల్లో తీరే కోరిక కోసం రాక్షసులు లాగా మారుతున్నారు. దేశంలో ఎక్కడో చోట ఇలాంటి అరాచాకాలు వెలుగు చూస్తున్నాయి.. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా  దుర్మార్గులలో మార్పు లేకుండా పోయింది. అవిటి వాళ్ళను కూడా వదలడం లేదు.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. అంధురాలు అయిన యువతి పై దారుణంగా రేప్ చేశారు. ఇది వినగానే గుండె తరుక్కు పోతుంది..



వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌ లో వెలుగు చూసింది.. స్థానికంగా వుండే ప్రముఖ బ్యాంక్ లో మేనేజర్ గా అంధురాలు అయిన మహిళ పనిచెస్తుంది.ఇంట్లో ఫిబ్రవరి లో 16, 2022న ఓ దొంగ చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లోని విలువైన వస్తువుల ను తీసుకెల్లాడు. అయితే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాలని అనుకుంది ఆ యువతి. తర్వాత రోజు ఆమె పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఈ ఘటన పై ఫిర్యాధు చేసింది. బాధిత యువతి పై పోలీసులు కూడా జాలి చూపించారు.



ఆమెకు కళ్ళు లేక పోవడం తో ఆనవాల్లు చెప్పలేక పోయింది. ఆమె చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 

9 రోజుల తర్వాత బాధిత యువతి మొబైల్‌ ను అమ్ముతూ నిందితుడు దొరికిపోయాడు.. అతన్ని పట్టుకొని చితకబాదారు. దాంతో ఆ దొంగ అసలు విషయాన్ని బయట కు చెప్పాడు.

పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అతని గొంతును ఆమె కనిపెట్టింది. 

కేసు పెట్టిన పోలీసులు నిందితుడిని కోర్టు లో ప్రవేశ పెట్టారు.అనంతరం రెండేళ్ళు ఆ కేసు పై విచారణ చేపట్టారు.. తర్వాత అతనికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: