ఘోర రైలు ప్రమాదం.. 60 మంది మృతి?
అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. తద్వారా ఈ ప్రమాదాల్లో ఎంతోమంది జీవచ్ఛవాలుగా మారిపోతూ ఉంటే ఇంకెంతో మంది మృత్యువాత పడుతూ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటారు. అయితే మనుషుల ప్రాణాలు తీయడానికి రోడ్డు ప్రమాదాలు చాలవు అన్నట్టు మరి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఎంతోమంది ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగి పోయింది అన్న విషయం తెలిసిందే.
ఇటీవలే కాంగో లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదం లో ఏకంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే రైలు పట్టాలు తప్పిన కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగింది అన్నది స్థానిక మీడియా చెబుతోంది. లేయేన్ నుంచి టెంకే వైపు ప్రయాణిస్తున్న రైలు లేవాప్వే వద్దకు రాగానే పట్టాలు తప్పి ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందిఅని సమాచారం. కాగా ప్రస్తుతం ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతు ఉండటం గమనార్హం.