అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్ ఫోన్ కాల్.. ప్రియురాలు ఏం చేసిందంటే?
ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈరోజుల్లో ఎవరూ అలా వెళ్తారు.. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.దామోహ్‌లోని 14 క్వార్టర్స్‌లో నివాసం ఉండే ప్రఫుల్ కశ్యప్ రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో ఓ కల్వర్టుపై కూర్చున్నాడు. అయితే కొందరు వ్యక్తులు అక్కడికి రావడంతో అతని పై దాడికి దిగారు. దాంతో అతని తీవ్రంగా గాయ పడ్డారు.. మొదట గొడవకు దిగారు.. తర్వాత దాడి చేసినట్లు అతను చెబుతున్నారు.
కాగా, తొడలో కత్తి దిగడంతో ఎటూ కదల్లేని స్థితిలో ఉన్నాడు ప్రఫుల్. వెంటనే తన గర్ల్‌ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పాడు.. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పడంతో ఆమె వెంటనే అక్కడికి వెళ్ళింది..అతని కాలికి ఆమె చున్నీతో కట్టింది. అయితే తన తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆమె కూడా పరుగున ఆసుపత్రికి పోయింది. తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే అక్కడికి వెళ్ళిన పోలీసులు అతను చెప్పిన విషయాల అధారంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఏది ఏమైనా అమ్మాయి ధైర్యానికి అందరు ఫిధా అవుతూన్నారు.