రెండో సంతానం లేదని.. ఆమె ఏం చేసిందో తెలుసా?
ఇక్కడ ఓ మహిళ చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రెండో సంతానం లేదు అన్న బాధతో గత కొన్ని రోజుల నుంచి ఎంతో మనస్థాపం చెందుతూ వస్తోంది వివాహిత. చివరికి ఇక జీవితం వృధా అని అనుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ గడ్డ పోలవరంలో వెలుగులోకి వచ్చింది. కాస్త వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం రూరల్ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన గారపాటి మౌనిక తూర్పుగోదావరి జిల్లా కాతేరు గ్రామానికి చెందిన దాసరి వీర వెంకట రామకృష్ణ తో 2015లో వెళ్లి జరిగింది. ఇక వీరికి ఆరేళ్ల పాప ఉంది. ఇటీవలే ఉద్యోగం రీత్యా పోలవరం పంచాయతీ పెద్ద రామాలయం వీధి లో అద్దెకు ఉంటున్నారు ఈ దంపతులు.
అయితే రెండవ సంతానం కలగడం లేదు అంటూ భార్య మౌనిక ఎంతో మనస్తాపం చెందుతూ వచ్చింది. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఇక ఈ ఘటనపై మౌనిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మహిళ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి అని చెప్పాలి.