హోలీ : రెచ్చిపోయిన మందుబాబులు.. ఏం చేశారంటే?

praveen
హోలీ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కులమతాలకు అతీతంగా హోలీ పండగ జరుపుకుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు.. చిన్న ల నుంచి పెద్దల వరకు  ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.  యువత అయితే హోలీ పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఇక హోలీ పండుగ వచ్చింది అంటే  ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది కేవలం రంగులో సరిపెట్టుకోకుండా.. ఫుల్లుగా మద్యం తాగడం పార్టీలు చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హోలీ పండుగ సందర్భంగా అక్కడికక్కడే కొంతమంది ఆకతాయిలు మందుబాబులు హల్చల్ చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలా ఆకతాయిలు హల్చల్ చేసిన ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. కాగా ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పండుగ సందర్భంగా ఫుల్లుగా మద్యం తాగిన మందుబాబులు వీరంగం సృష్టించారు. ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురిచేశారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. అశోక్ నగర్లో కొంత మంది మందుబాబులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఏకంగా ఇంట్లో ఫుల్ గా మద్యం తాగి వచ్చి రోడ్డు మీద నానా హంగామా చేశారు.


 ఏకంగా చేతిలో మద్యం సీసాలను పట్టుకొని చుట్టుపక్కల కనిపించిన జనాల పైకి విసిరేయడం మొదలుపెట్టారు. అంతేకాదు రోడ్డు వెంట వెళ్లే వారిపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఏకంగా పలువురికి గాయాలు అయ్యాయి అన్నది తెలుస్తుంది. అయితే గాయాలపాలైన వారిలో ఒక మహిళ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న మందుబాబులు ఏమాత్రం తగ్గకుండా పోలీసులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అంతకుముందు మందుబాబులు చేసిన హంగామా లో ఒక మహిళ తలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరికిపోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: