కాబోయే భర్తే కదా అని అలా చేసింది.. కానీ చివరికి?
ఒకరంటే ఒకరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలి అని అనుకున్నారు. ఇక భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పోటీపడి మరీ ఉద్యోగం సంపాదించుకున్నారు. కాబోయే భర్త కదా అని సహజీవనం చేయడం మొదలుపెట్టింది. కానీ ఇంతలో ఊహించని ఘటన. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పిన ప్రియుడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. ఏకంగా పాపం అని చూడకుండా పెట్రోల్ పోసి తగులబెట్టాడు.ఈ దారుణ ఘటన కర్నాటకలోని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.
విజయపుర ఇంజనీరింగ్ కాలేజీలో దానేశ్వరి, చంద్రశేఖర్ కలిసి చదువుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే భవిష్యత్ గురించి ఆలోచించి బాగా చదువుకొని సెటిల్ అయిన తర్వాత ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొన్నాళ్ళ పాటు సహజీవనం కూడా చేశారు. కాలేజీ అయిపోయింది ఉద్యోగం కూడా వచ్చింది. అంతా సాఫీగా జరిగి పోతుంది కానీ అంతలో దానేశ్వరి పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చింది. ఇక తన పేరెంట్స్ తో మాట్లాడి వస్తానంటూ చంద్ర శేఖర్ ఇంటికి వెళ్లి వచ్చాడు. కులాలు వేరైనా కారణంగా పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఇక పెళ్లి చేసుకోను అంటూ చెప్పేసాడు. ప్రియురాలిని వదిలించుకోవాలని ప్లాన్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న దానేశ్వరినీ హాస్పిటల్ లో చేర్పించి పరారయ్యాడు. ఇక చివరికి చికిత్స పొందుతూ మృతి చెందింది సదరు మహిళ. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..