ఆ దొంగ ఎవరో కాదు.. మిస్టర్ ఇండియా?

praveen
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపడమే కాదు ఇక ఎంతో మంది జీవితాలను రోడ్డు పాలు చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా కరోనా వైరస్ దూసుకురావడం ఇక అంతలోనే ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఇక అందరి జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి కనీసం కుటుంబపోషణ కూడా చూసుకో లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ధైర్యంగా బ్రతికి ఉన్న వారిని కరోనా వైరస్ పంజా విసిరి ప్రాణాలు తీసింది.

 ఏదో ఒక పని చేసుకుంటూ సభ్య సమాజంలో ఎంతో గర్వంగా బతికిన వారీ జీవితాలను రోడ్డుమీదికి లాగింది. చివరికి నేరస్తులుగా మార్చింది కరోనా వైరస్. కరోనా వైరస్ కారణంగా ఎలాంటి ఉపాధి దొరక్కపోవడంతో చివరికి కష్టాల పాలు కావడం లేదా అప్పులు పాలు కావడం కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఎంతో మంది దొంగలుగా అవతారమెత్తిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఒక మిస్టర్ ఇండియా కి కూడా ఇలాంటి ఒక దుస్థితి ఏర్పడింది. అతను వెయిట్ లిఫ్టింగ్ లో ఏకంగా మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు.

 అతనికి బంగారంలాంటి భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కరోనా వైరస్ అతని రోడ్డుపాలు చేసింది. చివరికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో దొంగగా మారి పోయాడు. ఇటీవలే చెన్నైలో ఓ మహిళ మెడలో నుంచి యువకుడు చైన్ లాక్కెళ్ళి ఘటన సంచలనంగా మారింది. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఎవరు అన్నది  తెల్సుకున్నారు. అతను ఎవరో కాదు 2019 బాడీ బిల్డింగ్ లో మిస్టర్ ఇండియా గా నిలిచిన  మహమ్మద్ పైజల్ అని గుర్తించారు. ఫోన్ ల బిజినెస్ చేసే అతను కరోనా తో నష్టాలపాలయ్యాడు. బాకీ తీర్చేందుకు చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: