ప్రియురాలిని స్నేహితులతో పంచుకున్నాడు.. చివరికి?
అయితే ఇక మరికొంతమంది కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీ లోని శ్రీకాకుళంలో వెలుగులోకి వచ్చింది. గూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది యువతి. అయితే కొద్ది రోజుల క్రిందట ఆమె బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. ప్రియుడికి ఈ విషయాన్ని చెప్పింది. అయితే తాను డ్రాప్ చేస్తానంటూ తియ్యగా మాట్లాడి నమ్మించాడు సదరు యువకుడు.
ఈ క్రమంలోనే ఇక ఆ యువతిని బైక్ పై ఎక్కించుకుని ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక ముగ్గురు స్నేహితులు ఉన్న ప్లేస్ కి తీసుకు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే ఇలా యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బాధితురాలు రిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనం గా మారిపోయింది. ఘటన తర్వాత ఇక ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటే ప్రతి ఆడపిల్ల స్థానికంగా భయపడిపోయే పరిస్థితి వచ్చింది..