ఉదయం ఇంటి డోర్ ముందు చాక్లెట్స్.. చిన్నారులు తిన్నారు.. చివరికి?

praveen
మనిషి జీవితంలో కొన్ని కొన్ని సార్లు ఊహించని ఘటన లు ఎన్నో వివాదాలకు కారణమవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో సంతోషంగా ఉన్నాం అనుకుంటున్న సమయంలో ఎన్నో ఘటనలు ఇక అందరినీ శోకసముద్రంలో ముంచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది. ఉదయం డోర్ తీయగానే ఇంటి ముందు కొన్ని చాక్లెట్స్ కనిపించాయి.  దీంతో ఆ వృద్ధురాలు వాటిని చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత వాటిని దాచి పెట్టి తన ముగ్గురు మనవళ్ళతో పాటు పక్కింట్లో ఉండే మరో పిల్లాడికి కూడా ఇచ్చింది వృద్ధురాలు. కానీ అవి తిన్న కాసేపటికి ఘోరం జరిగిపోయింది. అకస్మాత్తుగా చిన్నారులు అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయాడు.

 ఎంతో కంగారు పడిపోయిన ఆ వృద్ధురాలు స్థానికుల సహాయంతో ఇక అందర్నీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారు అన్న విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన  స్థానికులను కూడా ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ఖుషి నగర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం గమనార్హం.  కసాయ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖియా దేవి ఫ్యామిలీ నివసిస్తుంది. అయితే ఉదయం ఆమె తన ఇంటి ముందు చీపురుతో ఊడుస్తుంది. డోర్ వద్ద కొన్ని పాలిథిన్ కవర్లు కనిపించాయ్. అందులో చాక్లెట్స్ ఉన్నాయి. వాటిని పిల్లలకు ఇస్తే వాళ్ళు ఇష్టంగా తిన్నారు.

 అయితే ఇలా చాక్లెట్స్ తిన్న   కాసేపటికి నలుగురు చిన్నారులు కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఇక చిన్నారులు అందరిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు వారు మరణించిన్నట్లు  ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు ఇద్దరు బాలురు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వయస్సు రెండేళ్ళు నుంచి ఐదేళ్ల లోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: