సులబ్ కాంప్లెక్స్ లో దారుణం.. ఏకంగా బాలికపై?
ఏకంగా పోలీసులు ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారిని ఎన్ కౌంటర్ చేసి చంపుతున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో అడుగడుగునా ఆడపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అక్కడ ఎక్కడ అనే తేడా లేదు. ఆడ పిల్లలు ఎక్కడ ఒంటరిగా కనిపిస్తే చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక సులబ్ కాంప్లెక్స్ లో మైనర్ బాలికపై అత్యాచారానికి జరగడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
బడంగ్పేట్ లో స్థానికం గా చిన్న వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తికి పదేళ్ళ కూతురు ఉంది.. అయితే ఇటీవలే సులబ్ కాంప్లెక్స్ లో పనిచేసే వ్యక్తి రవీందర్ ఇక ఆ బాలిక పై లైంగికదాడికి యత్నించాడు. తన కూతురు కనబడటం లేదని అనుమానం తో సులబ్ కాంప్లెక్స్ లో వెతకగా ఏడుస్తూ కనిపించింది. ఇక ఏం జరిగింది అని అడగడంతో ఇక తనపై అత్యాచారం జరిగింది అన్న విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో కాంప్లెక్స్ లో పనిచేసే రవీందర్ ను దారుణంగా చితకబాదాడు బాలిక తండ్రి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..