వ్యాపారం పెట్టాలనుకున్నాడు.. కానీ పెట్టుబడి కోసం ఇదేం పని?
తాను తాను ఎంత కష్టపడినా ఇంటి ఖర్చులకే సరి పోతుంది ఇక వ్యాపారాన్ని ప్రారంభించాలన్న కోరిక తీరుతుంది అన్న నమ్మకం మాత్రం అతనిలో కనిపించడం లేదు. దీంతో ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అనే ఆలోచన అతని మదిలో మెదిలింది. దీంతో సినిమాటిక్ స్టైల్ లో దొంగతనం చేయాలని భావించి చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. రాజేష్ ఐటిఐ పూర్తి చేసి ప్రస్తుతం ఎలక్ట్రికల్ పనులు చేస్తూ వచ్చిన సంపాదనతో జీవనం సాగిస్తున్నాడు.
మంచి బిజినెస్ పెట్టుకోవాలి అని భావించిన రాజేష్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోతే ఎంత బాగుంటుంది అని ఒక ఆలోచన చేశాడు. ఈ క్రమం లోనే సులభంగా మనీ సంపాదించేందుకు జూదం దొంగతనం రెండు మార్గాలను ఎంచుకున్నాడు. దొంగతనం అయితే ఒకేసారి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని భావించాడు. దీంతో కొన్ని ఇళ్లను సెలెక్ట్ చేసుకుని ఇక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. కిలోన్నర కు పైగా బంగారం మూడు కిలోల వెండి 5 లక్షల నగదు కూడా దోచుకెళ్లాడు. యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో తనదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు రాజేష్ ను అరెస్టు చేశారు.