ఓరి నాయనో.. భర్తను పంచుకున్న భార్యలు?
కానీ ఇక్కడ భార్య మాత్రం అలా చేయలేదు. తన భర్తను మరొక మహిళతో షేర్ చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బీహార్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ పూర్నియా జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి జరిగింది. ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. భార్యను సంతోషంగా చూసుకుంటూ ఇక పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన సదరు వ్యక్తికి మరో మహిళపై ప్రేమ పుట్టింది. దీంతో ఇక మొదటి భార్యను మొదటి భార్యకు పుట్టిన పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళ మోజులో పడి ఇంటికి రాకుండా బయట బయట తిరుగుతూ ఉండేవాడు.
చివరికి మరో మహిళను మొదటి భార్యకు తెలియకుండా రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నిజం ఎన్నాళ్ళు దాచగలం చెప్పండి. చివరికి ఓ రోజు రెండో భార్యకు భర్తకు అప్పటికే పెళ్లయి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో భర్త ను ఇద్దరు భార్యలు పంచుకోవాలని పోలీసులు ఒక సలహా ఇచ్చారు. దీంతో ఇక సదరు మహిళలు కూడా అదే ఫిక్స్ అయిపోయారు. 15 రోజుల పాటు ఒక భార్య దగ్గర మరో 15 రోజుల పాటు ఇంకో భార్య దగ్గర ఉండాలనే ఓ షరతుతో ఇక ఆ ఇద్దరు మహిళలు ఒప్పందం చేసుకున్నారు. ఇక ఇద్దరు మహిళలను భర్త వేరు వేరు ఇళ్లల్లో ఉంచి పోషణ బాధ్యతలు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అని సూచించారు పోలీసులు.