చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. ఆ యువకుడు ఎంత పని చేసాడు?
ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. ఏలూరు నగరం మండలం లో ఆలస్యం గా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కూడా భయబ్రాంతులకు గురి చేసింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను ప్రవీణ్ కుమార్ అనే యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను ఇంటి సమీపంలో వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఏడుస్తూ బాలిక ఇంటికి చేరింది. ఏం జరిగిందని అడిగినా చెప్పలేదు.
అయితే బాలికకు రక్తస్రావం అవుతూ ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇక బాధిత బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక అంతే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ల దగ్గర పలు వివరాలు సేకరించగా.. ఇక బాలికపై అత్యాచారానికి పాల్పడినది ఎవరోకాదు ప్రవీణ్ కుమార్ అనే 25 ఏళ్ల యువకుడు అన్న విషయం తేలింది. దీంతో నిందితుని అరెస్టు చేసిన విచారిస్తూ ఉండడం గమనార్హం.