కోట్లు వస్తాయని ఆశ చూపారు.. చివరికి?
ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో వెలుగులోకి రావడం గమనార్హం. పాట్నాకు చెందిన ఒక యువతి నీ కోట్ల రూపాయలు వస్తాయని ఫరీదాబాద్ కి పిలిపించారు. ఇక యువతి మహిళను కలిసింది. ఇక ఆ తర్వాత ఆమె సహాయంతో స్వామీజీని కలవగా.. అతను పూజలు చేయాలని చెప్పి రెండు రోజులు తనతోనే ఉంచుకున్నాడు. ప్రసాదం లో మత్తు మందు కలిపి ఇచ్చి దాదాపు రెండు రోజులపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తేరుకున్న తర్వాత తనపై అత్యాచారం జరిగిందని గుర్తించిన యువతి అన్యాయం జరిగిపోయింది మోసపోయాను అని తెలిసి పోలీసులను ఆశ్రయించింది.
ఈ క్రమం లోనే ఇక జరిగిన ఘటన మొత్తం పూసగుచ్చినట్లు గా పోలీసులకు వివరించింది. ప్రసాదం లో మత్తు పదార్థం ఇచ్చి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించింది సదరు యువతి. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇక ఈ ఘటనలో సదరు యువతిని స్వామి దగ్గరికి తీసుకు వెళ్ళిన మహిళ ఎవరు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.