ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారో తెలుసా?

praveen
ఇటీవలికాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి అని అటు పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎంతోమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న కారణంగా చివరికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఇలాంటి రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్న ఘటనలు కూడా వస్తే వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 15 మందికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వేగంగా దూసుకు వచ్చిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయం లో బస్సులో ఏకంగా ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక వేగంగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.


 కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో ఇక వారి కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రి వద్ద మిన్నంటాయి. రాత్రి ఈ ప్రమాదం జరగడంతో ఇక సహాయక చర్యలు కాస్త ఆలస్యం అయ్యాయి అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: