ఆత్మహత్య చేసుకునేందుకు రైలు కింద పడ్డాడు.. కానీ ఎలా బతికాడో తెలుసా?

praveen
ఆత్మహత్య.. ఆత్మహత్య.. ఆత్మహత్య ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఎక్కడ చదివినా ఇదే వార్త కనిపిస్తుంది. ఎందుకంటే నేటి రోజుల్లో ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు కాస్త పిరికివాళ్లలా మారిపోతున్నారు అన్నది అర్ధమవుతుంది. చిన్నచిన్న కారణాలకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సభ్య సమాజం తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని విధంగా మార్చేస్తున్నాయ్. చిన్న కారణాలకే అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.


 క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది . పాపం ఆ యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఎన్నో రోజుల పాటు మనస్థాపంతో కుంగిపోయాడు. ఆ తర్వాత జీవితం వృధా అని అనుకొని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలి అని భావించాడు. ఇలా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తే రైలు కింద పడి ఆత్మహత్య చేసి కేవలం క్షణాల్లో ప్రాణాలు పోతాయి అని నిర్ణయించుకున్నాడు.  చివరికి ఎంతో ధైర్యం చేసి ఇక రైలు కింద పడ్డాడు.


 కానీ అతనిలో ఉన్న ప్రాణ భయమే చివరికి అతని ప్రాణాలతో బయట పడేలా చేసింది. ఈ ఘటన విశాఖ రైల్వేస్టేషన్లో వెలుగులోకి వచ్చింది. నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై రైలు వస్తున్న సమయంలో ఓ యువకుడు అకస్మాత్తుగా రైలు పట్టాల పైకి వెళ్ళాడు. ముందు నుంచి రైలు దూసుకొస్తోంది. కానీ అంతలో అతనికి ఆత్మహత్య చేసుకునేందుకు దైర్యం సరిపోలేదు. దీంతో రైలు పట్టాల మధ్య బిక్కుబిక్కుమంటూ పడుకుండిపోయాడు. ఇక రైలు వెళ్లే వరకు కూడా కదలకుండా రెండు పట్టాల మధ్య ఉండటంతో ఎలాంటి గాయాలు కాకుండానే బయటపడ్డాడు. అయితే ఇది గమనించి ప్రయాణికులు కేకలు వేయడంతో అప్రమత్తమైన ఆర్పిఎఫ్ సిబ్బంది అతన్ని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: