వామ్మో.. ఫోన్ లో విడాకులు.. ఒక్క రూపాయి భరణం?

praveen
ఒకప్పుడు వివాహబంధంతో ఒక్కటైన వారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని గొడవలు జరిగినా ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేవారు. సాంప్రదాయబద్దంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకున్న వారు ఇక వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇచ్చేవారు. అంతేకాదు ఇక జీవితంలో సర్దుకుపోతూ ఇక తమ భాగస్వామితో ఎంతో ఆనందంగా జీవించే వారు. ఇలా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం పెళ్లి అనే పదానికి అసలు విలువ లేకుండా పోయింది అని వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది.

 ఎందుకంటే భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు మనస్పర్థల కారణంగా విడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మరి కొంతమంది వేరొకరిని పెళ్లి చేసుకోవాలి అని భావించి త్రిపుల్ తలాక్ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇలా ఇటీవలి కాలంలోభార్య భర్తలు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్న ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి లోనుచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిన్నర్ గ్రామం లో కుల పెద్దలు ఇచ్చిన తీర్పు కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ గ్రామంలో ఉండే భార్యాభర్తలు ఇద్దరూ కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కేవలం భర్త మాత్రమే కులపెద్దలు నిర్వహించిన పంచాయతీకి హాజరయ్యాడూ. కానీ భార్య మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే ఇక భర్తతో భార్యకు ఫోన్ చేయించి ఇక ఫోన్లోనే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు.  అయితే ఇందుకు సదరు మహిళ తండ్రి కూడా ఒప్పుకోవడం గమనార్హం. ఒక రూపాయి మాత్రమే భరణం ఇస్తాను అంటూ చెప్పడంతో దీనికి కూడా సదరు మహిళ తండ్రి అంగీకరించాడు.అయితే బాధితురాలికి ముతమాటే అభియాన్ కు చెందిన సామాజిక కార్యకర్తలు అండగా నిలవడంతో భర్త సహా కుల పెద్దల పై కేసు నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: