పెళ్లైన మూడో రాత్రే.. షాక్ ఇచ్చిన కోడలు.. ఏం చేసిందంటే?
ఈ క్రమంలోనే ఆరోగ్యం బాగుండాలంటే రోజు పాలు తాగాలి అంటూ ఎంతో ప్రేమగా చెప్పింది కోడలు. కోడలు అలా చెప్పిన తర్వాత ఊరుకుంటారా.. అత్తమామలు ప్రతిరోజు రాత్రి పాలు తాగడం మొదలు పెట్టారు. ఇలా మూడో రోజు రాత్రి కూడా పాలు తాగి పడుకున్నారు. కానీ పొద్దున్నే లేచి చూసే సరికి ఒక్కసారిగా షాక్. కోడలు ఇంట్లో కనిపించకుండా పోయింది. దీంతో మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలుగులోకి వచ్చింది.
కార్తీక్ చౌక్ లో నివాసముంటున్న సచిన్ తివారీకి మహారాష్ట్రకు చెందిన యువతీతో ఇటీవలే వివాహం జరిగింది. ఇక అతనికి 40 ఏళ్ల వయసులో వివాహం జరగడం గమనార్హం. దీంతో కొంతమంది బంధువుల మధ్య ఈ వివాహ వేడుక జరిగిపోయింది. అత్తారింట్లో అడుగు పెట్టిన నవవధువు అత్తమామలను భర్తను ఎంతో ప్రేమగా చూసుకునేది. భోజనం వడ్డించడం తో పాటు రాత్రి పాలు కూడా ఇచ్చేది. ఇలా మూడు రోజుల పాటు అత్తమామలకు పాలు ఇచ్చింది. మూడో రోజు రాత్రి కోడలు ఇచ్చిన పాలు తాగిన అత్తమామలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. పొద్దున లేచి చూస్తే 50 వేల నగదు బంగారు నగలు కనిపించలేదు. ఇక కోడలి ఫోన్ తో పాటు సంబంధం కుదిర్చిన వ్యక్తి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.