సెల్ ఫోన్ ఇవ్వని ప్రియురాలు.. ప్రియుడు ఏం చేసాడో తెలుసా?
ఇలా ప్రేమించిన పాపానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి కూడా ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ప్రియురాలిపై కోపంతో రగిలిపోయాడు ప్రియుడు. ఈ క్రమంలోనే మాట్లాడుదాం అంటూ పిలిచాడు. తాను బహుమతిగా ఇచ్చిన సెల్ఫోన్ తిరిగి ఇవ్వాలి అంటూ కోరాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో విచక్షణ కోల్పోయి యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఘటన జార్ఖండ్లోని పాకూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి డెడ్ బాడీ ఊరి శివార్లలో గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటీవలే అదృశ్యమైన యువతి డెడ్ బాడీ గా మారిందని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరు హత్య చేసి ఉంటారు అన్న విషయంపై విచారణ జరిపారు. కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు ఆ తర్వాత ఆ యువతి ప్రియుడు ని పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది. ఎన్నో బహుమతులు ప్రియురాలికి కొనిచ్చాను. కానీ తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకునేందుకు సిద్ధమైందని.. తాను బహుమతిగా ఇచ్చిన ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరితే నిరాకరించింది అంటూ పోలీస్ విచారణలో అతను చెప్పుకొచ్చాడు అందుకే ఇక ప్రియురాలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు..