మహిళల భద్రతలో.. ఒడిషా చెత్త రికార్డ్?
ఇకపోతే ఇటీవల ఒడిషా లో 15 ఏళ్ల బాలికపై మూడు నెలల సమయం లోనే పలుమార్లు లైంగిక దాడి జరిగిన ఘటన ఎంతో సంచలనంగా మారిపోయింది. అయితే ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఒడిషాలోని నయాగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే మహిళలు పిల్లల పట్ల దాడులూ వరుసగా జరుగుతున్నాయ్. మైనర్ బాలిక రేప్ హత్య కేసులో ఇప్పటికి కూడా పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ సంపాదించుకోలేక పోయారు. ఈ ఘటన కంటే ముందు సుందర్ ఘర్ లో ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల కారణంగా 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇలా మహిళల రక్షణ విషయం లో ఒడిషా రాష్ట్రం ఒక చెత్త రికార్డులు నమోదు చేసింది అని చెప్పాలి. 2021 సంవత్సరానికి గాను 11 శాతం రేప్ కేసులు పెరిగినట్లు తెలుస్తుంది. ఇక 2018 నుంచి 2021 వరకు చూస్తే 32% రేప్ కేసులు పెరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు ప్రకారం ఒడిశా ఈ కేటగిరీలో టాప్ లిస్టులో ఉందట. అంతేకాదు చిన్నారులు మహిళలపై లైంగిక వేధింపుల దాడులలో కూడా పెరుగుదల కనిపిస్తూ ఉందట. ఇక ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వివరించడం గమనార్హం..