పెన్నులు బుక్ కొనిస్తానన్నాడు.. కానీ చివరికి?
ఇక అభం శుభం తెలియని చిన్నారులు కూడా కామపు చూపు లతో చూస్తూ చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేస్తూ ఉన్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. బాలిక పై కన్నేసిన ఓ కామాంధుడు పెన్నులు బుక్స్ కొనిస్తాను అంటూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను పెన్నులు పుస్తకాలు కొని ఇస్తానని గౌడ్ అనే వ్యక్తి నమ్మించాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి ఒక పాడుబడ్డ పాత బంగ్లా లోకి తీసుకు వెళ్ళాడు.
ఆ తర్వాత ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. స్థానికులు వస్తున్నారు అన్న విషయాన్ని గమనించిన సదరు కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు గౌస్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం అందించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన గౌస్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటన కాస్త ఇక ఆడ పిల్లల తల్లిదండ్రులు అందరిలో కూడా మరింత భయాందోళనలు పెంచింది అని చెప్పాలి.