డబుల్ బెడ్రూం రాలేదని.. ఆమె ఏంచేసిందో తెలుసా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీఎన్నో రకాల హామీలను ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇలా ఇచ్చిన హామీల లో అటు డబుల్ బెడ్ రూము ఇళ్ళు కూడా ఒకటి.  అర్హులైన పేద ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇస్తుంది అంటూ హామీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎంతోమంది పేద ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.


 కానీ ఇప్పటివరకు ఎంతోమంది పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ కల కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది డబుల్ బెడ్రూంలు ఇప్పించాలి అంటూ అటు ప్రజాప్రతినిధులను వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైనా సభ జరిగినప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు పేద ప్రజలు. ఇక మరికొంతమంది ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లాంటి వాళ్లు వచ్చినప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఎక్కడ పోయాయి అంటూ నేరుగా ముఖం మీద ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది ఇక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడం లేదని ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదు అని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోలు పోసుకుని సూసైడ్ ఆటంప్ట్ చేసింది. ఘటన  కాస్త స్థానికంగా సంచలనం గా మారిపోయింది. కొండపాక మండలం రవీంద్ర నగర్ కు చెందిన మహిళ తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని నిరసన తెలుపుతూ ఒంటిపై పెట్రోలు పోసుకుంది. ఈ క్రమంలోనే  గమనించిన స్థానికులు ఇక ఆమెను నివారించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: