టెక్కీలకు షాకిస్తున్న కంపెనీలు.. ఎందుకంటే?

Satvika
దేశంలోని ప్రముఖ నగరాల్లో డ్రగ్స్ వ్యవహారం కాస్త ఎక్కువగా ఉంది.. సామన్యులు, సెలెబ్రిటీలు, బిజినెస్ మెన్ లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఇలా అందరు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు.. ఒకప్పుడు మద్యానికి బానిసలుగా మారిన వాళ్ళు నేడు మత్తు పదార్థాలను ఎక్కువగా వాడుతున్నారు.. ముంబాయి, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో డ్రగ్స్ జోరుగా సాగుతోంది. మొన్నీమధ్య హైదరాబాద్లో పబ్ లలో భారీగా డ్రగ్స్ దొరికిన విషయం అందరికి తెలిసిందే. ఈ కేసు లో చాలా మంది ప్రముఖులు కూడా ఉండటం విశేషం అని చెప్పాలి..


డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక అంత కదిలినట్టయింది. సెలబ్రిటీల తో మొదలైన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దాకా వెళ్ళింది.హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మెడకు చుట్టుకుంది.. పబ్ లో జరిగిన దాడిలో ఎన్నో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. రాకెట్ తో సంబంధాలు కలిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కు ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రగ్స్‌తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఐటీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నాయి ఆయా ఐటి  కంపెనిలు. డ్రగ్స్ కేసులో సంబంధం కొందరు ఉద్యోగులను కంపెనిలు పీకి పారెస్తున్నాయి.


ఇప్పటికే పలు కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులను 13 మందిని ఉద్యొగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. మరి కొంతమందికి కొద్ది రొజులలొనె నోటిసులు అందించిన సంగతి తెలిసిందే.. నగరం లో డ్రగ్స్‌ సరఫరా చేసే లక్ష్మీపతి నుంచి టెకీలు డ్రగ్స్‌, హాష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. లక్ష్మీపతి కస్టమర్లలో పదుల సంఖ్యలో టెకీలు ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలిపారు. మరో 50 మంది వున్నట్లు తెలిపారు.. ఇప్పటికే చాలా మంది పేర్లను రివిల్ చేశారు.నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మరి కొంత మందికి నోటిసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: