గదిలోకి వెళ్లిన 11ఏళ్ళ బాలుడు.. కిటికీలోంచి చూసి పేరెంట్స్ షాక్?
ఇటీవలే సెల్ఫోన్ కి బానిసలుగా మారిపోతున్న పిల్లలు చదువును పక్కన పెట్టేస్తున్నారు. అయితే సెల్ఫోన్ ను పక్కనపెట్టి ముందు చదువుకోవాలి అంటూ తల్లిదండ్రులు కాస్త మందలించారు అంటే చాలు చివరికి ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా చిన్నచిన్న ఘటనల కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆరో తరగతి చదువుతున్న బాలుడు మొబైల్ లో ఆన్లైన్ గేమ్ లకు బానిస గా మారిపోయాడు.
ఈ క్రమంలోనే ఇటీవల ఈ స్కూల్ కి వెళ్ళి వచ్చాడు. ఇక గేమ్ ఆడుకోవాలి ఫోన్ ఇవ్వండి నాన్న అంటూ అడిగాడు. తండ్రి ఇవ్వను అంటూ చెప్పడంతో సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడులోని పొల్లాచ్చిలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఇవ్వనందుకు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిన బాలుడు ఎంతకీ బయటకి రాలేదు. ఏం చేస్తూ ఉన్నాడా అని తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. ఇక ఈ ఘటనతో స్థానికంగా సంచలనం గా మారిపోయింది. చిన్న కారణానికి తమ కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఘటనపై కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.